మీ పాత ఫోన్‌ని పడేస్తున్నారా? దానిని ఇలా ఉపయోగించుకోవచ్చు..

Throwing away your old phone It can be used like this,Do not throw your old phone, try these 6 useful ways,Dont throw away your old phone,mango news,mango news telugu,Get Rid of an Old Cell Phone,Reuse Old phones,Recycling Your Old Cell Phone,How to recycle old cell phones,Recycle old phones for cash,Sell Old Mobile Phone Online,Cell phone recycling,Cell phone recycling Latest News,Cell phone recycling updates,Cell phone recycling news,Cell phone recycling Latest news and updates

ఇప్పుడు ఎక్కడ చూసినా స్మార్ట్ పోన్లతోనే కనిపిస్తున్నారు. అయితే మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చిందనో.. కావాల్సిన ఫీచర్లు లేవనో తమ పాత మొబైల్‌ను పక్కన పడేసి కొత్త ఫోన్ కొనుక్కుంటున్నారు. అయితే ఇది ఇంట్లో వేరే వాళ్లు వాడితే ఓకే కానీ.. ఎవరూ వాడకుండా పక్కన పడేయడమే సమస్యగా అవుతుంది. ఎవరింట్లో చూసినా మనుషుల కంటే కూడా వాడి పడేసిన స్మార్ట్ ఫోన్లే ఎక్కువ దర్శనమిస్తున్నాయి.

ఆ తర్వాత వాటి వల్ల ఉపయోగం లేదని చెత్తబుట్టలో పడేస్తుంటారు. అలా పారేసే ఫోన్లు తర్వాత ఎలక్ట్రానిక్ వ్యర్థాలు లేదా ఈ-వేస్ట్‌గా మారి మన పర్యావరణానికి హాని కలిగిస్తాయి . అందుకే వాటిని కొన్ని రకాలుగా వాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

పాత ఫోన్ కెమెరా ఇప్పటికీ పని చేస్తుంటే మాత్రం.. మీరు దానిని డాష్ క్యామ్‌గా మార్చొచ్చు. దాని కోసం,ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఏదైనా డాష్ కెమెరా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.   మీ పాత ఫోన్‌ను మౌంట్ చేయడానికి  కారులో ఫోన్ హోల్డర్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.ఇలా చేస్తే.. రోడ్డు ప్రమాదాలు లేదా మీకు వీడియో రికార్డింగ్ అవసరమయ్యే సమయంలోనూ,  ఇతర ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఈ కెమెరా ఉపయోగపడుతుంది.

అలాగే  పాత ఫోన్‌ని రీసైకిల్ చేయడానికి  దానిని ఒక స్టోరేజ్ పరికరంగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల  ఫోటోలు, వీడియోలు, ఫైల్‌లు లేదా ఏదైనా ఇతర డేటాను  పాత ఫోన్‌కి బదిలీ చేసుకోవచ్చు. దానిని పోర్టబుల్ డ్రైవ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.

పాత ఫోన్ పని చేసే స్థితిలో లేకపోయినా..లేదా అది  ఏ విధంగానూ ఉపయోగించలేనట్లయితే, దానిని చెత్తబుట్టలో వేయడానికి బదులుగా, క్యాషిఫై డాట్ ఇన్ , రీ సైకిల్ డివైస్ డాట్ కామ్, లేదా నమోవేస్ట్ డాట్ కామ్  వంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో రీసైక్లింగ్ కోసం పంపించవచ్చు. ఈ వెబ్‌సైట్‌లు ఇండియాలో  ఇ-వ్యర్థాల సేకరణ కోసం ఇంటింటికీ సేవలను అందిస్తాయి. దీనివల్ల  ఓల్డ్ టెక్నాలజీని  రీసైక్లింగ్ యూనిట్‌లకు రవాణా చేయొచ్చు.  ఇక్కడ కొన్ని భాగాలను రీసైకిల్ కూడా చేయవచ్చు లేదా పర్యావరణ అనుకూల పద్ధతిలో ఎక్కడో సురక్షితంగా పడేయొచ్చు. అయితే ఇలా పాత మొబైల్ ఫోన్లను  రీసైక్లింగ్ కోసం పంపడం వల్ల.. డబ్బు కానీ రివార్డ్‌లను కూడా పొందొచ్చు.

అలాగే అమెజాన్, ఫ్లిప్ కార్ట్, టాటా క్లిక్ వంటి ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో పాతస్మార్ట్  ఫోన్‌ని ఇచ్చి..దానికి బదులు కొత్తది మార్చుకోవచ్చు. అయితే ఇలాంటి ఆఫర్లు పండుగ సమయంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి  ఆ టైములో ఇలాంటి డీల్స్‌కు వెళ్లొచ్చు. అప్పుడప్పుడూ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు కాబట్టి అందులో మార్చుకున్నా పర్వాలేదు. లేదా ఓ ఎల్ ఎక్స్ వంటి సైట్లలో సెకండ్స్‌లో సేల్ చేసుకోవచ్చు.

అంతేకాదు ఫోన్ బ్యాటరీని వాడేయానికి బదులు, మీ పాత ఫోన్‌ను నావిగేషన్ పరికరంగా ఉపయోగించుకోవచ్చు. కారు లేదా బైక్‌పై ఫోన్ హోల్డర్‌లో మీ పాత ఫోన్‌ని మౌంట్ చేయండి మరియు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గూగుల్ మ్యాప్స్‌ను, యాపిల్ మ్యాప్స్‌ని ఉపయోగించుకుంటే చార్జింగ్ బాధల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఒకవేళ ఎవరికైనా ఆ పాత అవసరం ఉన్నవారికి ఇస్తే వారి అవసరం తీరుతుంది. అలాగే పాత మొబైల్ ఇంట్లో పడి ఉండకుండా ఉంటుంది. అలాగే నచ్చిన వాళ్లు స్మార్ట్ ఫోన్ ను  విరాళంగా ఇవ్వవచ్చు. ఇలా పాత స్మార్ట్ ఫోన్లను  అనవసరంగా పడేయకుండా ఇలా చేస్తే పర్యావరణాన్ని కాపాడినవారవుతారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =