తెలంగాణలో 324 కేంద్రాల్లో కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ

Corona Vaccination Programme Continues in 324 Centers In Telangana

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 140 కేంద్రాల్లో 3962 మందికి వ్యాక్సిన్ వేశారు. తాజాగా మరో 184 కేంద్రాలు పెంచి మొత్తం 324 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ముందుగా వారం మొత్తంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో సోమవారం నాడు వ్యాక్సినేషన్ కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున సోమవారం నాడు మొత్తం 16200 మందికి వ్యాక్సిన్ వేయనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో 42 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ