రాష్ట్రాలకు ఇప్పటివరకు 26.69 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేత

Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News, Vaccine Distribution

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. రాబోయే 3 రోజుల్లో మరో 47 లక్షలకుపైగా (20,48,890) వ్యాక్సిన్ డోసులను అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉచిత కేటగిరీ ద్వారా మరియు నేరుగా రాష్ట్రాల సేకరణ కేటగిరీ ద్వారా మొత్తం 26.69 కోట్లకుపైగా (26,69,14,930) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు.

ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి జూన్ 15, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 25,67,21,069 డోసులను వినియోగించినట్టు కేంద్రం ప్రకటించింది. ఇక అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 1.05 కోట్లకుపైగా (1,05,61,861) కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here