తెలంగాణ రాష్ట్రంలో మరో 1554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 22, బుధవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 49,259 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 15,882 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 438 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.88 (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1,281 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 37,666 కి చేరింది. దీంతో రికవరీ రేటు 76.5 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం 11,155 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 842, రంగారెడ్డిలో 132, మేడ్చల్ లో 96, కరీంనగర్‌లో 73, నల్గొండలో 51, వరంగల్ అర్బన్‌లో 38, వరంగల్ రూరల్‌లో 36, నిజామాబాద్‌లో 28, మెదక్‌లో 25, సంగారెడ్డిలో 24, పెద్దపల్లిలో 23, ఖమ్మంలో 22, కామారెడ్డిలో 22, సూర్యాపేటలో 22, వనపర్తిలో 21, రాజన్న సిరిసిల్లలో 18, మహబూబ్‌నగర్ లో 14, నాగర్‌కర్నూల్‌లో 14, మహబూబాబాద్‌లో 11 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu