దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్రం, రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులతో కీలక సమావేశం

Union Health Minister Mansukh Mandaviya Chairs Review Meeting With State and UT's Health Ministers Amid Covid-19 Surge,Union Health Minister Mansukh Mandaviya,Mansukh Mandaviya Chairs Review Meeting,Review Meeting With State and UT's Health Ministers,Amid Covid-19 Surge,Mango News,Mango News Telugu,Union health minister chairs Covid review meet,Amid Rising Covid-19 Cases,India reports more than 5000 cases,Health Minister Likely To Chair Review,Minister Mansukh Mandaviya Latest News,Covid-19 Latest Updates,Covid-19 Latest News,UT's Health Ministers Latest News

దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ విస్తరిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులలో పెరుగుదల కనిపిస్తోంది. గడచిన వారం రోజులుగా 3వేలు, 4వేలుగా నమోదవుతున్న కేసులు ఈరోజు 6వేలకు పైగా నమోదవడం విశేషం. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సహా పలువురు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు పలువురు హాజరయ్యారు. కరోనా మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తదితర ఆంశాలపై వారితో చర్చించారు. కాగా కోవిడ్-19 కేసుల పెరుగుదల దృష్ట్యా కేంద్రం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇటీవలే మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అలాగే దేశంలో కోవిడ్ పరిస్థితిపై అంచనా వేయడానికి కొన్నిరోజుల క్రితం ప్రధాని మోదీ అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక దేశంలో ఈరోజు 24 గంటల్లో 6,050 కొత్త కేసులు నమోదు కాగా, శుక్రవారం యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కి చేరుకుంది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 07, ఉదయం 8 గంటల వరకు):

  • ఏప్రిల్ 6న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,60,742
  • కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 06–ఏప్రిల్ 07 (8AM-8AM)] : 6,050
  • మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,47,33,719
  • కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 2,069
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,85,858
  • కరోనా రికవరీ రేటు : 98.75 శాతం
  • యాక్టీవ్ కేసులు : 28,303
  • కొత్తగా నమోదైన మరణాలు : 14
  • మొత్తం మరణాల సంఖ్య : 5,30,943
  • మొత్తం కరోనా వ్యాక్సిన్‌ డోసులు: 220.66 కోట్లు పంపిణీ

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fourteen =