హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరా వేగ‌వంతానికి చర్యలు చేపట్టాలి: సీఎస్

CS Somesh Kumar Held Review Meeting with Officials on Supply of Drinking Water in Hyderabad

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ , మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ డా.యన్.సత్యనారాయణ లతో సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మెరుగైన త్రాగు నీటి సరఫరా కోసం వినియోగదారుల పీటీఐఎన్ మ‌రియు సీఏఎన్ నెంబర్ లతో ఆధార్ సీడింగ్ ను పూర్తి చేయాలని, ఇప్పటి వరకు సరఫరా కాని ప్రాంతాలు మరియు మురికి వాడలలో ఉన్న ఇండ్లకు త్రాగు నీటి సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ కు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం నిర్మాణాలు మౌళిక వసతులతో సహ వేగంగా పూర్తి చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ వార్డులలో ట్రీ పార్కులు అభివృద్ధి పరచాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ