దేశంలో వేగంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ, 75 లక్షలకుపైగా లబ్ధిదారులకు వ్యాక్సిన్

More than 75 lakh Beneficiaries have Received Corona Vaccine in India,Mango News,Mango News Telugu,Over 75 lakh people administered COVID-19 vaccine in country so far,More than 75 lakh beneficiaries vaccinated against COVID19,India fastest to cross the 7 million Vaccination mark,Coronavirus News LIVE Updates,India exported COVID-19 vaccines worth about Rs 338 crore so far says Piyush Goyal

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాలతో పోలిస్తే అతితక్కువ సమయంలోనే 70 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసిన దేశంగా భారత్ నిలిచింది. వ్యాక్సిన్ పంపిణి ప్రారంభించిన 27 వ రోజైన ఫిబ్రవరి 11, గురువారం నాడు మొత్తం 11,314 సెషన్స్ లో 4,87,896 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 12, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 75 లక్షలకు పైగా (75,05,010) మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. వీరిలో 58,14,976 హెల్త్ కేర్ వర్కర్స్, 16,90,034 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ఉన్నట్టు తెలిపారు.

మొత్తం ఇప్పటికి దాకా కరోనా వ్యాక్సినేషన్ లో 10 రాష్ట్రాల నుంచే 69.34 % లబ్ధిదారులు ఉన్నట్టు పేర్కొన్నారు. అందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే (7,63,421) మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 3,25,538 మంది, తెలంగాణలో 2,43,665 మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ వేశారు.

రాష్ట్రాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =