త్వరలో ఓరుగల్లు నిఘంటువు అందుబాటులోకి – సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్

A Dictionary of Indian Literature, definition of Orugallu, Juluru Gourishankar, Mango News, Orugallu, Orugallu Dictionary, Orugallu Dictionary To be Available Soon, Sahitya Akademi, telangana, Telangana Sahitya Akademi, Telangana Sahitya Akademi Chairman, Telangana Sahitya Akademi Chairman Juluru Gourishankar, Telangana Sahitya Akademi Chairman Juluru Gourishankar Says Orugallu Dictionary, Telangana Sahitya Akademi Chairman Juluru Gourishankar Says Orugallu Dictionary To be Available Soon, Warangal Dictionary

వంద సంవత్సరాల క్రితమే ఓరుగల్లు నిఘంటువు వచ్చిందని, దాన్ని సాహిత్య అకాడమి తిరిగి పునర్ముద్రించాలని శాసనమండలి సభ్యులు బండ ప్రకాశ్ కోరారు. మంగళవారం నాడు సాహిత్య అకాడమి కార్యాలయంలో చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి నిఘంటువు నిర్మాణాలపై చర్చించారు. కొన్ని దశాబ్దాల క్రితం తంజావూరు పబ్లికేషన్స్ పేరున ఓరుగల్లు నిఘంటువును వారు ముద్రించారని తెలిపారు. వరంగల్లు ప్రాంతంలో ఇప్పటికీ వెలుగు చూడని తరతరాల జానపద సాహిత్య జన చరిత్రను వెలుగులోకి తేవాలని పేర్కొన్నారు. పోతన విజ్ఞాన పీఠం, రాజరాజ నరేంద్ర గ్రంథాలయాలను శక్తివంతం చేయటానికి జరుగుతున్న కృషిలో పాలుపంచుకోవాలని చెప్పారు.

అలాగే పాల్కురికి సోమనాథుని సమగ్ర సంకలనాలు వెలుగులోకి తేవాలని చెప్పారు. బండ ప్రకాశ్ కోరిన విధంగా ఓరుగల్లు నిఘంటువు తిరిగి పునర్ముద్రిస్తామని గౌరీశంకర్ తెలిపారు. ఓరుగల్లు నిఘంటువు గ్రంథం అందుబాటులో లేదని అందుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కర్నూల్ కలెక్టరేట్ లో ఇలాక్ గ్రంథాలయ విభాగంలో ఉన్నట్లు సమాచారం ఉందని ఇందుకు సంబంధించి ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నామన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =