రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలకు నాణ్యత గల కూరగాయలను సరఫరా చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు జిల్లా కలెక్టర్లు, సంక్షేమ శాఖల కార్యదర్శులు, రెసిడెన్షియల్ పాఠశాలల కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ బుధవారం నాడు ఒంటిమామిడిలో వెజిటబుల్ మార్కెట్ ను సందర్శించి రైతులతో సంభాషించిన విషయం తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్ సంస్ధలు, హాస్టళ్లకు ఒంటిమామిడి నుండి కూరగాయలను సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కలెక్టర్లను, కార్యదర్శులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. కూరగాయల సరఫరాకు సంబంధించి సాధ్యమయ్యే అధ్యయనంతో పాటు కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. దీని వలన చౌక ధరలకే నాణ్యమైన కూరగాయలు లభ్యతతో పాటు రైతులకు కూడా లాభం కలుగుతుందన్నారు. కూరగాయల సేకరణ, రవాణాలో యువతను భాగస్వాములు చేయాలని కార్యదర్శులను ఆదేశిస్తూ, అర్హత గల వారికి రవాణాకు సంబంధించి ఆర్ధిక చేయూత పథకం ద్వారా సహాయం అందించాలని సీఎస్ ఆదేశించారు.
విద్యాసంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి:
దీంతో పాటు ఫిబ్రవరి, 1 నుండి విద్యాసంస్ధలు ప్రారంభించడానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సిద్ధం కావాలని, తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. విద్యాసంస్ధలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను కోరారు. విద్యా సంస్ధలు నియోజక వర్గ పరిధికి బయట పనిచేస్తున్నాయని, వీటిని టైమ్ బౌండ్ పద్ధతిలో నియోజకవర్గ పరిధిలోకి తరలించాలని కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ