రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్న 16 ప్రతిపక్ష పార్టీలు

16 Opposition Parties to Boycott President’s Address, congress leader Ghulam Nabi Azad, Farm Laws, Farmers Protest Against Farm Laws, Ghulam Nabi Azad, Ghulam Nabi Azad Announced That 16 Opposition Parties, Mango News, Opposition Parties to Boycott President Address, Parliament Budget Session, Parliament Budget Session 2021, President Ram Nath Kovind

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి (జనవరి 29, శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో 16 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ గురువారం నాడు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

“మేము 16 రాజకీయ పార్టీల నుండి ఒక ప్రకటనను విడుదల చేస్తున్నాం. రేపు పార్లమెంటులో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాము. వ్యవసాయ చట్టాలు ప్రతిపక్షం లేకుండా సభలో బలవంతంగా ఆమోదించబడడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం” అని ఆజాద్ వెల్లడించారు. ఈ 16 పార్టీల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఎంసీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, పీడీపీ, కేరళ కాంగ్రెస్(ఎం), ఆర్ఎస్పీ, ఐయుఎంఎల్, ఎండీఎంకే, ఏఐయూడీఎఫ్, జీకేఎన్సీ ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 11 =