డ్రగ్స్ వినియోగం తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. యువతే లక్ష్యంగా పెట్టుకున్న కొంతమంది విక్రయదారులు యదేచ్ఛగా డ్రగ్స్ అమ్ముతున్నారు. ఒకప్పుడు ఢిల్లీ, ముంబై,గోవా లాంటి మహా నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్ కి విపరీతంగా విస్తరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లోను డ్రగ్స్ వినియోగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన డ్రగ్స్ అనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ముందడుగు వేయడం అభినందనీయం. అందులో భాగంగానే సినిమా పరిశ్రమను కూడా ఈ డ్రగ్స్ ను అరికట్టే మిషన్ లో భాగస్వాములను చేయదలచారు.
ప్రభుత్వం దగ్గరకు సినిమా టికెట్ల రేట్లు పెంచాలని, ఘూటింగ్ లు చేయడం కోసం ప్రత్యేక అనుమతుల కోసం వచ్చే సినిమా పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు షరతు విధించారు. ఆయా సినిమాల్లో నటించే నటీనటులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా సైబర్ క్రైమ్‌పై వీడియో విడుదల చేయాలని కోరారు. సినిమా ప్రారంభం కావడానికి ముందు గాని తర్వాత గాని, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించే విధంగా కాని, దాని నుంచి బయటపడే విధంగా కాని సైబర్ క్రైమ్‌పై రెండు వీడియోలను థియేటర్లలో ప్రదర్శించాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని అభినందించారు. ప్రతి సినిమా థియేటర్ లో సినిమాకు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ కు సంబంధించిన వీడియోలు ఉచితంగా ప్రదర్శించేలా చూడాలన్నారు. ఈ నిబంధనలకు సహకరించిన వారికే అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలుగు పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి కండీషన్లు పెట్టడాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే సినిమా అనే మాధ్యమం ప్రజలపై చాలా బలమైన ముద్రవేస్తుందనటంలో సందేహం లేదు. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే తెలుగు సినిమాల్లో సెక్స్, డ్రగ్స్, మద్యాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఏ సినిమా చూసుకున్న కాని డ్రగ్స్ వాడటాన్ని ఏదో ఓ సీన్ లో చూపిస్తున్నారు. యువతను ఆకట్టుకునే ఉద్దేశ్యంతోనే సినిమాల్లో డ్రగ్స్, సెక్స్, మద్యం విచ్చలవిడిగా చూపిస్తున్నారు. డ్రగ్స్, సెక్స్, మద్యం సన్నివేశాలు లేని సినిమాలు చాలా చాలా తక్కువ ఉంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ మహమ్మారిని తెలుగు సినిమా ఏ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాయో అర్ధమవుతోంది. తెలుగు సినిమాలు చూసే వాళ్ళందరికీ ఈ విషయాలు బాగా తెలుసు. డ్రగ్స్, మద్యం, సెక్స్, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా షార్ట్ వీడియోలను రూపొందించాలని, సినిమాల్లో చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి కండీషన్ పెట్టడం మంచిదే. దీంట్లో తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. అయితే అదే సమయంలో డ్రగ్స్, సెక్స్, మద్యాన్ని ప్రమోట్ చేయవద్దని కండీషన్ కూడా పెట్టాలి. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో కూడా వీటికి సంబంధించిన కంటెంట్ రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY