కాంచీపురం వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్

AttiVarada Swamy, AttiVarada Swamy Temple, AttiVarada Swamy Temple In Kanchipuram, CM KCR Visits AttiVarada Swamy Temple, CM KCR Visits AttiVarada Swamy Temple In Kanchipuram, Kanchipuram, KCR Visits AttiVarada Swamy Temple, KCR Visits AttiVarada Swamy Temple In Kanchipuram, Mango News Telugu, Telangana CM KCR Visits AttiVarada Swamy Temple, Telangana CM KCR Visits AttiVarada Swamy Temple In Kanchipuram

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు లోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచి చేరుకున్నారు. మార్గ మధ్యంలో నగరి లో ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా కేసీఆర్ కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాంచీపురం చేరుకున్నారు. కాంచీపురంలో ఆలయ అధికారులు, వేద పండితులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.

ఆలయంలో అత్తివరదరాజస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ తో పాటు కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే ఆర్కే రోజా, తదితరులు స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. కాంచీపురం ఆలయ సందర్శన అనంతరం కేసీఆర్ తిరుపతికి చేరుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అక్కడి నుండి ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ కు పయనమవుతారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here