హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్‌లో.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించటంతో థియేటర్‌లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. మంటల వలన థియేటర్ పైకప్పు కాలి, కూలిపోయింది. ప్రమాద సమయంలో ఎవరూ లోపల లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో విధులలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్‌ల సహయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయ్యుండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ