మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Hyderabad, KT Rama Rao inaugrates Medtronic engineering, KTR launches Medtronic engineering and innovation centre, Mango News, Medtronic Engineering and Innovation Center, Medtronic Engineering and Innovation Center in Hyderabad, Medtronic sets up largest R&D centre outside the US, Minister KTR, Minister KTR Inaugurated Medtronic Engineering and Innovation Center, Minister KTR Inaugurated Medtronic Engineering and Innovation Center in Hyderabad, Telangana Industries Minister KT Rama Rao

హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అమెరికాకు చెందిన మెడ్ ట్రానిక్ సంస్థ అధునాతన మరియు వినూత్న సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, ఆవిష్కరణల కోసం ప్రపంచస్థాయిలో పనిచేస్తుంది. హైదరాబాద్ లో రూ.1200 కోట్ల‌తో మెడ్ ట్రానిక్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అమెరికా తర్వాత తమ కార్యకలాపాలు కోసం రెండో అతిపెద్ద పరిశోధన మరియు అభివృద్ధి సెంటర్ ను మెడ్ ట్రానిక్ హైదరాబాద్ లో ప్రారంభించింది. ముందుగా 1000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఆతరువాత ఈ సంస్థ ద్వారా మరో నాలుగువేల మందికి ఉపాధి లభించనుంది.

అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ ట్రానిక్‌ పనిచేస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుంది. హైదరాబాద్ మెడ్‌ ట్రానిక్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ తో పాటుగా మెడ్‌ ట్రానిక్ ఛైర్మన్ అండ్ సీఈఓ జియోఫ్ మార్తా, యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ జోయెల్ రీఫ్మాన్, కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం సెక్రటరీ ఎస్.అపర్ణ, మెడ్‌ ట్రానిక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎండీ మదన్ ఆర్ కృష్ణన్, తెలంగాణ ఇండస్ట్రీస్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మరియు లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =