గాంధీ ఆసుపత్రిలో సమ్మె విరమించిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది

Gandhi General Hospital, Gandhi Hospital, Gandhi Hospital Doctors, Gandhi Hospital Doctors Strike, Gandhi Hospital outsourcing Staff, Gandhi Hospital outsourcing Staff Called off Strike, Gandhi Hospital Staff Called off their Strike, telangana, Telangana Coronavirus

గాంధీ ఆసుపత్రిలో గత రెండురోజులుగా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టుగా వారు పిలుపు నిచ్చారు. కాగా సిబ్బందితో ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ చ‌ర్చ‌లు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. డీఎంఈ రమేశ్‌ రెడ్డితో జరిగిన చర్చల అనంతరం వెంటనే విధుల్లోకి చేరుతున్నట్లుగా తెలిపారు. నాల్గ‌వ త‌ర‌గ‌తి ఉద్యోగుల‌కు రోజుకు 300 రూపాయ‌ల అదనపు భత్యం ఇవ్వ‌డంతో పాటుగా ఇక‌పై నెలలో షిఫ్టుల వారీగా 15 రోజులు మాత్ర‌మే విధులకు హాజరయ్యేందుకు అధికారులు అంగీకారం తెలిపారు. అలాగే న‌ర్సుల‌కు 17,500 నుంచి 25 వేల రూపాయ‌ల వేత‌నంతో పాటుగా క‌రోనాకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న వారికీ రోజువారీగా అదనపు భత్యం కింద రూ.750 ఇచ్చేందుకు కూడా అధికారులు స‌ముఖత వ్య‌క్తం చేసినట్లుగా సమాచారం. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సమ్మెతో గాంధీ ఆసుపత్రిలో రోగులు ఇబ్బందులు ఎదుర్కోగా, వారు విధుల్లో చేరడంతో ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu