“కళ్యాణలక్ష్మి పథకం” పై సమీక్ష, రూ. 675 కోట్లు విడుదల

Kalyana Lakshmi, Kalyana Lakshmi Pathakam, Kalyana Lakshmi Scheme 2020, Kalyana Laxmi, Kalyana Laxmi Scheme, Minister Gangula Kamalakar, Minister Gangula Kamalakar Reviewed Kalyana Laxmi Scheme, Shaadi Mubarak, Telangana Kalyana Laxmi Scheme, TS Kalyana Lakshmi Pathakam

తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కళ్యాణలక్ష్మి పథకంపై జూలై 15, బుధవారం నాడు బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ బి.సి సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బి.సి మరియు ఈ.బి.సి వధువులకు రూ.675 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ విడుదలైన బడ్జెట్ ను 2016-17 నుండి 2018-19 వరకు ఉన్న బకాయిలకై రూ.44.11 కోట్లు, 2019-2020 మరియు 2020-2021 లబ్దిదారులకై రూ.591.35 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని వెల్లడించారు. రెవెన్యూ డివిజినల్ అధికారులు ఈ నిధులను త్వరితగతిన అర్హులైన వారికి విడుదల చేయాలని కోరారు. ఇప్పటి నుండి ఈ పథకం యొక్క ప్రగతిని రెవెన్యూ డివిజన్ల వారీగా ఎప్పటికప్పుడు ప్రిన్సిపల్ సెక్రెటరీతో కలిసి సమీక్షించనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =