గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు ఈ రోజుతో నామినేషన్ పక్రియ పూర్తయింది. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్స్ దాఖలు చేశారు. తొలిరోజు 17 మంది అభ్యర్థులు మొత్తం 20 నామినేషన్లు దాఖలు చేయగా, రెండో రోజు 522 మంది అభ్యర్థులు మొత్తం 580 నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. కాగా చివరి రోజైన శుక్రవారం నాడు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పలు పార్టీల అభ్యర్థులు కీలక నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్స్ వేశారు. నామినేషన్స్ సంఖ్యపై అధికారిక వివరాలు రాత్రికి వెల్లడయ్యే అవకాశం ఉంది. టిఆర్ఎస్ పార్టీ మాత్రం మొత్తం 150 డివిజన్లలో తమ అభ్యర్థులను బరిలోకి దించింది. ఇక రేపు నామినేషన్లు పరిశీలన జరుపనున్నారు. అలాగే నవంబర్ 22 ను నామినేషన్స్ ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 4 న ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ