శంషాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఓ ఫెసిలిటీ సెంట‌ర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurates Safran Aircraft Engine MRO Facility Center at Shamshabad, Telangana Minister KTR Inaugurates Safran Aircraft Engine MRO Facility Center at Shamshabad, KTR Inaugurates Safran Aircraft Engine MRO Facility Center at Shamshabad, Minister KTR Launches Safran Aircraft Engine MRO Facility Center at Shamshabad, KTR Starts Safran Aircraft Engine MRO Facility Center at Shamshabad, Telangana Minister KTR Inaugurated Safran Aircraft Engine MRO Facility Center at Shamshabad, Safran Aircraft Engine MRO Facility Center at Shamshabad, Shamshabad Safran Aircraft Engine MRO Facility Center, Safran Aircraft Engine MRO Facility Center, Safran Aircraft Engine MRO Facility Center News, Safran Aircraft Engine MRO Facility Center Latest News, Safran Aircraft Engine MRO Facility Center Latest Updates, Safran Aircraft Engine MRO Facility Center Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటయింది. ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని శంషాబాద్‌ వద్ద రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ కంపెనీ నిరయాన్ని స్వాగతిస్తూ నిన్న ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఫెసిలిటీ సెంట‌ర్ ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2018 నుంచి హైదరాబాద్‌లో దీనిని ఏర్పాటు కోసం శాఫ్రాన్ తో పలుమార్లు చర్చలు జరిపామని వెల్లడించారు. ఎయిర్ క్రాఫ్ట్ రంగంలో 8 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, 250 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు కేటీఆర్.

అయితే, ఇప్పుడు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండో ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం శాఫ్రాన్ కంపెనీ దాదాపు 1200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని, దీనిద్వారా 1000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు. దేశంలోనే తొలి ఎంఆర్‌ఓ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. బెంగళూరు, చెన్నైలో ఏర్పాటు చేయనున్న మరో కేంద్రాన్ని కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని శాఫ్రాన్‌ సీఈవోను కోరుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, ఈ ఫెసిలిటీ సెంటర్‌ను భారత్‌తోపాటు మధ్యప్రాచ్య దేశాలు వినియోగిస్తున్నాయని మంత్రి చెప్పారు. శాఫ్రాన్ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి 800 మందికి శిక్షణ ఇవ్వనుందని తెలిపారు. విమానయానం, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా ఉందని, రాష్ట్రంలో ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, కంపెనీ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 3 =