పెరుగుతున్న కరోనా కేసులు, 57 గంటల పాటు పూర్తిస్థాయి కర్ఫ్యూ

57 Hours Complete Curfew Shall be Imposed in Ahmedabad City, 57-Hour Corona Curfew In Gujarat, 57-Hour Corona Curfew In This Gujarat, Ahmedabad, Ahmedabad Curfew from 9pm Friday, Ahmedabad curfew lockdown news, ahmedabad curfew updates, Ahmedabad to Impose Total Weekend Curfew, Coronavirus Lockdown, Curfew Shall be Imposed in Ahmedabad City from Friday 9 PM, Mango News Telugu, Marathon 57-hour curfew in Ahmedabad

దేశంలో ఇటీవలి పండుగ సీజన్ తరువాత పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో నవంబర్ 20, శుక్రవారం రాత్రి 9 గంటల నుండి 57 గంటల పాటుగా నవంబర్ 23, సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. అహ్మదాబాద్ నగరంలో కేసుల పెరుగుదల, కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన అనంతరం పూర్తి కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు గుజరాత్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి రాజీవ్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఈ కర్ఫ్యూ సమయంలో పాలు మరియు మందులను విక్రయించే దుకాణాలను మాత్రమే తెరిచేందుకు అనుమతి ఉంటుందని చెప్పారు. అలాగే రాష్ట్రప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా సోమవారం నుండి రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ కూడా అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు ప్రస్తుత కరోనావైరస్ పరిస్థితి నేపథ్యంలో గుజరాత్‌లోని పాఠశాలలు, కళాశాలలను నవంబర్ 23 నుంచి తిరిగి ప్రారంభించడం లేదని, వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక గుజరాత్ లో నవంబర్ 19, గురువారం నాటికీ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,92,982 కి చేరింది. 1,76,575 మంది కోలుకోగా, ప్రస్తుతం 12,577 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా వలన గుజరాత్ లో ఇప్పటికి 3,830 మంది మరణించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =