ఏ పథకానికి ఎవరు అర్హులో ఎలా చెక్ చేసుకోవాలి?

an application in public administration,eligible for scheme,Ration cards, cooking gas subsidy ,application
an application in public administration,eligible for scheme,Ration cards, cooking gas subsidy ,application

ఎన్నికల గ్యారంటీల అమలు దిశగా ఇప్పుడు తెలంగాణ  ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో  హామీ ఇచ్చిన కాంగ్రెస్ ..ఇప్పటికే రెండు పథకాలను అమల్లోకి తెచ్చింది.మిగిలినవి మార్చి 15 లోగా ప్రారంభించాల్సి ఉండగా.. దీనికి సంబంధించి ప్రజాపాలన ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అలా దరఖాస్తు చేసిన వారు ఏ పథకానికి అర్హులు, వారి అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం తెలంగాణ వాసుల నుంచి ఇప్పటికే  దరఖాస్తులను స్వకరించింది .తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఇప్పుడు ఒక్కొక్కటిగా కంప్యూటరైజ్ చేస్తున్నారు. తెలంగాణలో పలు సంక్షేమ పథకాల కోసం   1.25 కోటి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువ దరఖాస్తులు.. రేషన్ కార్డులు, వంటగ్యాస్ సబ్సిడీ కోసం వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికంగా భావిస్తుండటంతో..కొత్త కార్డుల కోసమే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకూ దాదాపు 75 శాతం దరఖాస్తుల వివరాలను సిబ్బంది కంప్యూటీకరణ చేసారు. మరో వారం పది రోజుల్లోనే ఈ  అప్లికేషన్ల ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

అయితే అప్లై చేసిన తమ అప్లికేషన్స్ ఏమయ్యాయో అని  దరఖాస్తు దారులు  తెలుసుకోవటం కోసం అధికారులు కొత్త విధానం ప్రారంభించారు. పథకాల కోసం దరఖాస్తు చేసిన వారు https.//prajapalana.telangana.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లి  తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఈ వెబ్ సైట్ లో లాగిన్ అవగానే చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే సరికొత్త ఆప్షన్ కనిపిస్తోంది. దరఖాస్తు దారులకు కేటాయించిన అప్లికేషన్ నంబర్ అందులో నమోదు చేస్తే మన అప్లికేషన్ ఏ స్థితిలో ఉందో అప్డేట్ వస్తుంది. అలాగే ఎన్ని పథకాలకు వారికి అర్హత ఉందనే అంశాన్ని తెలుసుకొనే అవకాశం కూడా ఉంది. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్లో అందించిన సమాచారంలో ఏమైనా తప్పులు ఉన్నాయనే విషయాలతో పాటు.. ఎలాంటి వివరాలు అధికారులకు అందించాలనే విషయాలను కూడా ఈ ఆన్ లైన్ విధానం ద్వారా అధికారులు అందుబాటులోకి తెచ్చారు.

అయితే ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం అనేది ముగిసిపోలేదని..అది నిరంతర ప్రక్రియ అని మంత్రులు చెబుతున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల వడపోత, స్క్రూటినీ పూర్తయిన తర్వాత పథకాల అమలుపై నిర్ణయం ప్రకటించనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రజాపాలన వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవటంతో పాటు ఏ పథకాలకు అర్హత ఉందనేది క్లారిటీ ఉండటంతో..  ముందుగానే తమకు అందే పథకాల పైన  లబ్దిదారులకు స్పష్టత వస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY