
ఈ ఏడాది జూన్ 2వ తేదీకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. దీంతో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉద్యోగుల కేటాయింపుతో పాటు.. ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపైన కూడా వెంటనే నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంగా విడిపోయి 12 జూన్ 2014న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. విభజన చట్టంలో భాగంగా పదేళ్ల పాటు హైదరాబాద్‌ను రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచారు. అలాగే ఉమ్మడి ఆస్తులను కూడా విభజన చట్టంలో భాగంగా విభజించారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రభుత్వ భవనాలను.. రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల కాలానికి విభజన చేయగా.. విభజన చట్టం ప్రకారం పదేళ్ల గడువు వచ్చే నెల జూన్ 12తో ముగియబోతోంది.
తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతుండటంతో.. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని కొన్ని అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో కలిసి చర్చించారు. అంతేకాదు ఈ అంశాలపై చర్చించడానికి ఈ నెల 18న కేబినేట్ సమావేశం నిర్వహించనున్నట్లు రేవంత్ చెప్పారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10లో పేర్కొన్న దాని ప్రకారం.. పెండింగ్‌లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల అంశాలు, ఉద్యోగుల కేటాయింపుతో పాటు ఆస్తులు, అప్పుల పంపిణీ వంటి అంశాలన్నింటిపైన కూడా నివేదిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అలాగే పదేళ్లు పూర్తవుతుండటంతో.. పునర్విభజన చట్టం ప్రకారం ఇప్పటి వరకూ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారబోతోంది. ఈ పదేళ్ల కాలానికి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి కొన్ని అధికారిక భవనాలను జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి వీలున్న ఉద్యోగుల బదిలీలు వంటి సున్నితమైన అంశాలను వెంటనే పూర్తి చేయాలని సీఎం చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY