మరో పదిరోజుల్లో నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా జరుగనున్న సందర్భంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. డిసెంబర్ 31 మరియు జనవరి 1 తేదీలలో జరిగే నూతన సంవత్సర వేడుకల కోసం త్రీ స్టార్ హోటల్స్ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి కలిగిన హోటళ్లు, క్లబ్‌లు మరియు పబ్‌లకు పక్కా నిబంధనలు విధించారు. ఆ రెండు రోజులు ఈ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ప్రకారం..
- జంట నగరాల్లో డిసెంబర్ 31 మరియు జనవరి 1న తెల్లవారుజామున ఒంటి గంట వరకు ప్రోగ్రామ్ ప్లాన్‌లను కలిగి ఉన్న అన్ని సంస్థలు అనుమతి మంజూరు కోసం కనీసం 10 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుదారులు, రాష్ట్ర పబ్లిక్ సేఫ్టీ అమలు చట్టం, 2013 ప్రకారం.. ఆయా ప్రాంగణాల్లో సీసీటీవీ కెమెరాలు, తగిన భద్రత పాటించడంతో పాటు అసభ్య/అశ్లీలత వంటి చర్యలను చేపట్టరాదు.
- అలాగే డీజే, మ్యూజిక్ సిస్టంలతోపాటు పటాకుల శబ్దాలు వంటివి 45 డెసిబుల్‌లకు మించకుండా ధ్వని స్థాయిలను నిర్వహించాలి.
- హోటల్స్ మరియు ఈవెంట్ ఆర్గనైజర్లు పార్టీలలో డ్రగ్స్ లేదా ఎలాంటి ఇతర మత్తు పదార్ధాలు వినియోగించరాదు.
- ఇక ఎక్సైజ్‌శాఖ అనుమతించిన సమయం తర్వాత మద్యం సరఫరా చేయరాదని సూచించిన సీపీ, న్యూ ఇయర్ రోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
- ఆరోజున ఎవరైనా మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కితే రూ. పదివేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్షతోపాటు మూడు నెలలపాటు లేదా దీర్ఘకాలికంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు.
- మద్యం తాగి ఉన్న కస్టమర్లకు డ్రైవర్లు/క్యాబ్‌లను అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం పబ్‌లు/బార్‌ల నిర్వహణ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE