హైదరాబాద్‌లో మళ్ళీ భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున నెమ్మదిగా మొదలైన వాన.. అనంతరం తీవ్ర రూపం దాల్చింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో జంటనగరాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతోట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు.. ఆఫీసులు, వ్యాపారాలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేవారికి పలు సూచనలు చేస్తున్నారు.
7-day forecast(Morning) of Telangana state based on 0000 UTC issued at 1000 Hrs IST dated: 22/07/2022 pic.twitter.com/rCOnG2j03k
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 22, 2022
మరోవైపు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అలాగే షియర్ జోన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఈ నెల 25 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది. ఇక రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో గురువారం ఉదయం భారీ వర్షం కురవడంతో బాట సింగారం మార్కెట్‌లో ఫ్రూట్స్ వరదకు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ