టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్

YSRTP Chief YS Sharmila Detained by Hyderabad Police During Protest at TSPSC Office Against Paper Leak Issue,YSRTP Chief YS Sharmila Detained,YS Sharmila Detained by Hyderabad Police,YS Sharmila During Protest at TSPSC Office,Mango News,Mango News Telugu,TSPSC Office,YSRTP Chief YS Sharmila Latest News,YSRTP Chief YS Sharmila Latest Updates,TSPSC Paper Leak IssueProtest at TSPSC Office Hyderabad,Sharmila Protests At TSPSC Latest News,Sharmila Protests At TSPSC Latest Updates,YSRTP Chief YS Sharmila Latest News,YSRTP Chief YS Sharmila Live News,Telangana TSPSC Office Latest Updates,TSPSC Paper Leak Case News Updates

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ తీరుని నిరసిస్తూ హైదరాబాద్ లోని కమీషన్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె కమీషన్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో వైఎస్ఆర్టీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. తనకు లుక్ అవుట్ ఆర్డర్ నోటీసులు ఇచ్చారని, తానేమైనా క్రిమినల్ నా? అని ప్రశ్నించారు. ఇక ఈ వ్యవహారాన్ని ఇద్దరికి మాత్రమే పరిమితం చేసేందుకు మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపైనా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు సేకరించడంలో సిట్ విఫలమవుతోందని, అందుకే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే పేపర్ లీకేజీకి బాధ్యులైన నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ పై ఆందోళన చెందుతున్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here