దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,14,835 కరోనా పాజిటివ్ కేసులు, 2104 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,59,30,965 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,84,657 కి పెరిగింది. కరోనా వ్యాప్తి వెలుగులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా నమోదయిన కరోనా కేసుల సంఖ్యలో ఇదే (3,14,835) అత్యధికం. గతంలో ఓసారి 24 గంటల వ్యవధిలో అమెరికాలో 3,14,835 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చాక ఇంత పెద్దసంఖ్యలో (2104) కరోనా మరణాలు చోటుచేసుకోవడం కూడా ఇదే తొలిసారి.
ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ వంటి 10 రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 23 లక్షలకు (22,91,428) చేరువైంది. మరో 1,78,841 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,34,54,880 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 84.46 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.16 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో 9 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు:
కాగా గత 24 గంటల్లో లద్దాఖ్, త్రిపుర, సిక్కిం, మిజోరం, లక్షద్వీప్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 9 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 22, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 27,27,05,103
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,59,30,965
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 21–ఏప్రిల్ 22 (8AM-8AM)] : 3,14,835
- నమోదైన మరణాలు : 2104
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,34,54,880
- యాక్టీవ్ కేసులు : 22,91,428
- మొత్తం మరణాల సంఖ్య : 1,84,657
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ