బ్రేక్‌ ద చైన్: మహారాష్ట్రలో నేటి నుంచి మరిన్ని కఠిన ఆంక్షలు అమలు

Maharashtra Govt Issues New Strict Restrictions under Break The Chain, Additional Restrictions To Break The Chain Of COVID-19, Coronavirus news highlights, Maharashtra Coronavirus, Maharashtra COVID-19 Cases, Maharashtra government, Maharashtra Government Imposes Additional Restrictions, Maharashtra Government Imposes Additional Restrictions To Break The Chain Of COVID-19, Maharashtra govt issues stricter Covid curbs, Maharashtra imposes additional restrictions, Maharashtra Imposes More Restrictions From Tomorrow, Maharashtra Lockdown, Mango News, Strict restrictions come into effect in Maharashtra

రాష్ట్రంలో రోజువారీగా వేలసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ‘బ్రేక్‌ ద చైన్‌’ పేరుతో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను మహారాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్టు బుధవారం నాడు ప్రకటించింది. ఈ ఆంక్షలు ఏప్రిల్ 22 రాత్రి 8 గంటల నుంచి మే 1 ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

మహారాష్ట్రలో కొత్తగా అమల్లోకి వచ్చే ఆంక్షలు ఇవే:

  • అన్ని ప్రభుత్వ కార్యాలయాలు (కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారం క్రింద నడిచే) మరియు ఇతర అన్ని ప్రైవేటు కార్యాలయాలు కేవలం 15 శాతం మంది సిబ్బందితోనే పని చేయాలి.
  • అవసరమైన సేవలను అందించే కార్యాలయాలు కూడా అత్యల్ప సామర్థ్యంతో పనిచేసేలా చూడాలి, అయితే ఏ సమయంలోనైనా వారి వర్క్ ఫోర్స్ 50 శాతానికి మించకూడదు.
  • వివాహాలుకు 25 మందికి మించి అనుమతి లేదు. ఒకే హాల్లో రెండు గంటలకు మించి ఈ వేడుకలు నిర్వహించకూడదు.
  • ప్రైవేటు వాహనాలకు అత్యవసర సర్వీసులు, సరైన కారణాలతోనే మాత్రమే అనుమతి, డ్రైవర్‌తో కలిపి 50 శాతం ప్రయాణికుల ఆక్యుపెన్సీ మించరాదు.
  • నగరాల మధ్య, జిల్లాల మధ్య నడిపే ప్రైవేటు బస్సులపై నియంత్రణ, సిటీలో రెండు స్టాప్‌ల కన్నా మించి బస్సుల్ని ఆపరాదని సర్వీస్‌ ఆపరేటర్లకు ఆదేశాలు. ప్రైవేట్‌ బస్సుల్లో ప్రయాణించేవారు తమ గమ్యస్థానం చేరాక, 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండేలా చేతిపై స్టాంప్ వేయాలి. ఈ నిబంధనలను ఉల్లఘించిన బస్సు ఆపరేటర్స్ కు రూ.10,000 జరిమానా.
  • లోకల్ ట్రైన్స్, మెట్రో, మోనో రైల్స్ లో కేవలం కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, వైద్యం అవసరం ఉన్నవారు కోసం మాత్రమే వినియోగించాలి. అయితే వారందరూ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
  • ప్రభుత్వ బస్సులు కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడవాలి. బస్సుల్లో నిలబడి ఎవరూ ప్రయాణించకూడదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + twenty =