ఆ అంశాలపై కేటీఆర్, హరీష్ రావులకు కేసీఆర్ దిశానిర్దేశం

kCR Directed kTR And Harish Rao On Those Issues, kCR Directed kTR And Harish Rao, kCR Directed On Those Issues, kTR And Harish Rao On Those Issues, KCR, KTR, Harish Rao, BRS, Telangana Assembly, kCR Directed On Latest Issues, Telangana News, Latest Assemly News, TS Politcal News, Telangana, Mango News, Mango News Telugu
KCR, KTR, Harish Rao, BRS, Telangana assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం వాడివేడిగా సాగిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావులు అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరించారు.  అధికార పక్షంపై దండయాత్ర చేశారు. తీవ్రస్థాయిలో కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై భగ్గుమన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఆ రోజంతా అసెంబ్లీ రసవత్తరంగా సాగింది. ఆ తర్వాత స్పీకర్ అసెంబ్లీని బుధవారానికి వాయిదా వేశారు. తిరిగి రేపు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది.

అయితే ఇప్పటికే ఓసారి గులాబీ బాస్ కేసీఆర్.. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, అధికారపక్షంపై ఎలా విరుచుకుపడాలన్న దానిపై గులాబీ దళానికి దిశానిర్దేశం చేశారు. అయితే మూడు రోజుల బ్రేక్ తర్వాత బుధవారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానుండడంతో మరోసారి కేసీఆర్.. కేటీఆర్, హరీష్ రావులకు దిశానిర్దేశం చేశారట. బుధవారం అసెంబ్లీలో చర్చకు వచ్చే అంశాలను ముందుగానే ఊహించి.. వాటికి తగ్గట్లుగా ఎలా వ్యవహరించాలనే దానిపై పలు సూచనలు చేశారట.

అలాగే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే ప్రజంటేషన్లు, చర్చపై ఏమాత్రం తగ్గకుండా తమ గళాన్ని వినిపించాలని ఆదేశించారట.  ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధంగా ఉండాలని..  అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు దొరికిని ఏ అవకాశాన్ని కూడా విడవొద్దని కేసీఆర్ సూచించారట. అలాగే పదేళ్లకాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోవద్దని హరీష్ రావు, కేటీఆర్‌లకు కేసీఆర్ సూచించారట.

అయితే హరీష్ రావు, కేటీఆర్‌లకు మించిన మాటకారి కేసీఆర్. అసెంబ్లీలో వీళ్లిద్దరే అధికారపక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఎక్కడా తగ్గకుండా అధికార పక్షానికి సమాధానం చెప్తూ రఫ్ఫాడించారు. అటువంటిది గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగితే ఇంకెలాగుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY