బీజేపీ మేనిఫెస్టో: బస్సుల్లో, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, విద్యార్థులకు ట్యాబ్‌లు

BJP Manifesto, BJP Manifesto For GHMC Elections, BJP Manifesto For GHMC Elections 2020, BJP Manifesto LIVE, BJP release GHMC election 2020 manifesto, BJP Releases Manifesto, BJP Releases Manifesto For GHMC Elections, GHMC, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections News, GHMC Elections Updates, Mango News

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు బీజేపీ‌ పార్టీ గురువారం నాడు మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, భూపేంద్ర యాదవ్, కే.లక్ష్మణ్‌ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఇటీవల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.25 వేలు అందిస్తామని ప్రకటించారు.

బీజేపీ మేనిఫెస్టో వివరాలు:

  • ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం, గ్రేటర్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు.
  • వరదసాయం కింద అర్హులందరికీ రూ.25 వేలు.
  • గ్రేటర్ పరిధిలో అందరికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ. కేంద్రప్రభుత్వ గైడ్ లైన్స్ ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ.
  • సెప్టెంబర్ 17 న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం.
  • నగరంలో వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక రూపకల్పన.
  • గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్, 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా.
  • కులవృత్తులు చేసుకునే వారికీ ఉచిత విద్యుత్.
  • ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ.
  • పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్.
  • గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు.
  • మహిళల కోసం నగరంలో కిలోమీటరుకో టాయిలెట్ ఏర్పాటు.
  • మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు.
  • గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సేవలు.
  • బస్సుల్లో, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
  • విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, వై-ఫై సౌకర్యం.
  • ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు.
  • పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు.
  • నగరంలో అతిపెద్ద తెలుగు గ్రంథాలయం ఏర్పాటు.
  • 125 గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు.
  • నాలాలు, డ్రైనేజీల ఆధునికీకరణ కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి.
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఉచితంగా ఇళ్ల నిర్మాణం.
  • ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జంక్షన్‌కో పైవంతెన.
  • పార్కింక్ సమస్య పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు.
  • జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు, జీహెచ్ఎంసీలోని ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత.
  • జీహెచ్ఎంసీ కార్మికులకు పన్నుల మాఫీ.
  • మూసీ పునరుజ్జీవం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ ఏర్పాటు.
  • ప్రతి డివిజన్‌కో గ్రీవెన్స్ సెల్, ప్రతి డివిజన్‌లో జిమ్, స్విమ్మింగ్‌ పూల్, చిల్డ్రన్ ప్లే జోన్.
  • పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ, పాతబస్తీలో ప్రతి డివిజన్‌కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు.
  • పాత హైదరాబాద్‌లో విద్యుత్ చౌర్యం నివారణకు చర్యలు.
  • వీధివ్యాపారులకు ఆరోగ్య బీమా.
  • ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7 వేల ఆర్థికసాయం, ప్రమాద బీమా.
  • హైదరాబాద్‌కు నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు.
  • ప్రతి డివిజన్‌లో 4 శ్మశానవాటికల నిర్మాణం.
  • హైదరాబాద్‌ రోడ్లపై గుంత కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతులు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =