రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాలలో 1.73 కోట్లతో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ను రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి మరియు ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ వైరాలజీ ల్యాబ్ ద్వారా ఇకపై ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన కరోనా అనుమానిత కేసులను పరీక్షించనున్నారు. ఇక్కడ ల్యాబ్ అందుబాటులోకి రావడంతో రోజుకు 100 వరకు కరోనా పరీక్షలు చేసేందుకు వీలు కలుగుతుందని, అలాగే కరోనాతో పాటుగా ఇతర వైరస్‌లకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు. ఈ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ దయాకర్, మేయర్ గుండా ప్రకాష్ , ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ 16, గురువారం నాడు ఒక్కరోజే కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 700 కు చేరుకుంది. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 18 మృతి చెందగా, 186 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఒక్కరోజే 68 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 496 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]