ఏప్రిల్ 1 ,బుధవారం నాడు కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కరోనా బాధితుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ అదే వార్డులో చికిత్స పొందుతున్న అతడి బంధువులు ఆగ్రహానికి గురై డ్యూటీలో ఉన్న వైద్యులపై దాడికి దిగారు. ఆసుపత్రి కిటికీ అద్ధాలు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపైనా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో గాంధీ ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని వెంటనే వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. సీపీ అంజనీకుమార్ ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించినట్టు ఆయన తెలిపారు.
గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన దాడిపై రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ, “గాంధీ హాస్పిటల్ లో డాక్టర్ లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో క్షమించం. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటి?, డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రతి డాక్టర్ కి రక్షణ కల్పిస్తాం. భరోసాతో పని చేయండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని” పేర్కొన్నారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న గాంధీ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్‌పై దాడి ఖండిస్తున్నామని, నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
The assault on Duty Doctor at Gandhi Hospital treating Corona Patients is Condemned. Strong Action against the culprits will be taken immediately. CP Hyderabad City has been directed to initiate appropriate measures with immediate effect. pic.twitter.com/qYiVT0zguF
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) April 1, 2020
[subscribe]