పంట నష్టం, పోడు భూములు, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయంపై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR Held Review On Crop Loss Podu Lands And Financial Assistance For Construction Of Houses For The Poor,CM KCR Held Review On Crop Loss,Review On Crop Loss Podu Lands,Financial Assistance For The Poor,Construction Of Houses For The Poor,Mango News,Mango News Telugu,Telangana CM Announces Rs10000 Compensation,Telangana CM Asks Officials To Initiate Measures,CM KCR Orders CS To Release Financial Assistance,KCR Prods Officials To Speed Up,CM KCR On Crop Loss Podu Lands,CM KCR News And Live Updates

రాష్ట్రంలో అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థికసాయం తదితర అంశాలపై ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

నష్ట పోయిన పంటలకు ఆర్థిక సాయం:

వడగండ్ల వానలతో రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటనలు చేపట్టి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నష్టపోయిన పంటలకు ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఆయా జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లా పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (ఏఈవో) సర్వే చేయించి జరిగిన పంట నష్టం వివరాలను పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని సీఎం తెలిపారు. ఈమేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని సీఎస్ శాంతి కుమారికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును సీఎం ఆదేశించారు. పంట దెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ నిధులను జమ చేయాలని సీఎం స్పష్టం చేశారు.

గొర్రెల పంపిణీ:

ఇప్పటికే ప్రకటించిన విధంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారాలు సాగాలని సీఎం స్పష్టం చేశారు.

పేదల ఇండ్ల నిర్మాణానికి సాయం:

ఖాళీ జాగాలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. ఇందుక సంబంధించి, విధి విధానాలను రూపొందించి జారీ చేయాలని సీఎం స్పష్టం చేశారు.

పోడు భూముల పంపిణీకి సంసిద్ధత:

రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా వుందా అనే అంశానికి సంబంధించి సీఎస్ శాంతి కుమారితో సీఎం సమీక్షించారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి 1 లక్షా 55 వేల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు పాస్ బుక్కులు ముద్రించి సిద్ధంగా వున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం అన్ని అంశాలతో తాము సిద్ధంగా వున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.

శ్రీ సీతారాముల కళ్యాణ నిర్వహణకు కోటి రూపాయలు:

శ్రీరామ నవమి సందర్భంగా ఈనెల 30న భధ్రాచలంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహణ కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 1 కోటి రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా, భధ్రాచలం దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో, దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు కళ్యాణ నిర్వహణ కోసం సీఎం నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవిన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =