తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు గుజరాత్ రాష్ట్రంలో దాహోద్‌లోని పరేల్‌లో రూ.20,000 కోట్లపైగా నిధులతో నిర్మించే లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణలోని వరంగల్‌లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు. గుజరాత్ యొక్క, గుజరాత్ చేత, గుజరాత్ కోసం, గుజరాత్ కు చెందిన అనే విధానంలో మోడెమోక్రసీకి కొత్త నిర్వచనంగా మారుస్తున్నారని విమర్శించారు. పార్లమెంటులో వాగ్దానాలు చేసినప్పటికీ తెలంగాణలోని వరంగల్‌లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిరాకరించారని, ఇది కేంద్రానికి సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Of Gujarat, By Gujarat, For Gujarat & To Gujarat – New definition of Modemocracy
Despite promises made in Parliament, Warangal in Telangana is denied locomotive coach factory
Shame on you NPA Govt https://t.co/gqptAayT7H
— KTR (@KTRTRS) April 22, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ