కర్ణాటక: హిజాబ్ ధ‌రించి పీయూసీ ప‌రీక్షకు హాజరైన ఇద్దరు స్టూడెంట్స్.. అనుమతించని అధికారులు

Karnataka Two Students With Hijab Are Not Allowed To Write PUC Exam in Udupi, Two Students With Hijab Are Not Allowed To Write PUC Exam in Udupi, Two Students Are not allowed to write PU exam in Udupi, PU exam in Udupi, Two Students With Hijab, Hijab, Karnataka, Karnataka Hijab Row, Karnataka Hijab Row News, Karnataka Hijab Row Latest News, Karnataka Hijab Row Latest Updates, Karnataka Hijab Row Live Updates, Udupi PU exam, 2 hijab row petitioners not allowed To Write PUC Exam in Udupi, 2 hijab row petitioners, Two Students Wearing Hijab Denied Permission To Write PUC Exam In Udupi, Students Wearing Hijab Denied Permission To Write PUC Exam In Udupi, Mango News, Mango News Telugu,

హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ఎనిమిది మంది విద్యార్థులలో ఇద్దరు ఉడిపి జిల్లాలోని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం నిరాకరించడంతో వారి రెండవ సంవత్సరం ప్రీ-యూనివర్శిటీ కళాశాల (PUC) పరీక్షలకు హాజరుకాలేకపోయారు. హిజాబ్ ధరించి వచ్చిన ఇద్దరు విద్యార్థులు రేషమ్ మరియు ఆలియా అస్సాదీ అనే ఇద్దరు విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ నుంచి వెనుదిరగటం సంచలనం రేపుతోంది. ఉడిపిలోని విద్యోదయ పియు కళాశాలలో పరీక్షలకు హాజరు కావడానికి ఇద్దరు తమ హాల్ టిక్కెట్లు తీసుకుని బురఖాలు ధరించి వచ్చారు. అయితే కళాశాల గేటు వద్ద వారిని అధికారులు అడ్డుకున్నారు. వారు దాదాపు 45 నిమిషాల పాటు ఇన్విజిలేటర్లను మరియు కళాశాల ప్రిన్సిపాల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించారు.

కానీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ నిషేధాన్ని సమర్థిస్తూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఆ తర్వాత వారు పరీక్షలకు హాజరుకాకుండా కళాశాల ప్రాంగణం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ద్వితీయ సంవత్సరం పీయూసీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. కాలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ జనవరి 1న క్యాంపస్‌లలో కండువాలను నిషేధిస్తూ ఉత్తర్వు జారీ చేయడానికి ముందు డిసెంబర్‌లో కనీసం ఎనిమిది మంది విద్యార్థులు హిజాబ్‌తో తరగతులలోకి ప్రవేశించకుండా ఆపివేయబడ్డారు. క్లాస్‌రూమ్‌లలోకి హిజాబ్‌ను అనుమతించేది లేదని అధికారులు పేర్కొన్నప్పటికీ విద్యార్థులు నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు మార్చి 15 న హిజాబ్ “ఇస్లాం యొక్క ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదు” అని పేర్కొంటూ దానిపై నిషేధాన్ని సమర్థించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + fourteen =