చేనేత కార్మికుల సంక్షేమ కోసం బ‌డ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం: మంత్రి కేటీఆర్

2021 National Handloom Day Celebrations, Hyderabad, KTR, KTR Participated in National Handloom Day Celebrations, Mango News, Minister KTR Participated in National Handloom Day Celebrations, Minister KTR Participated in National Handloom Day Celebrations at Hyderabad, National Handloom Day, National Handloom Day 2021, National Handloom Day Celebrations, National Handloom Day Celebrations 2021, National Handloom Day Celebrations at Hyderabad, National Handloom Day News

జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో నేతన్నలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగింస్తూ, చేనేత కార్మికుల‌కు ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. 2018 నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో చేనేత‌ క‌ళాకారుల‌ను స‌త్క‌రించి, అవార్డులు అందిస్తున్నామ‌ని తెలిపారు. అవార్డుతో పాటు న‌గ‌దు పుర‌స్కారం రూ. 25 వేల‌ను అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ఏడాది 31 మంది చేనేత‌ క‌ళాకారుల‌ను స‌త్క‌రించుకున్న‌ట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ప్ర‌తి సంవ‌త్స‌రం ఎగ్జిబిష‌న్ నిర్వ‌హించి, చేనేత వస్త్రాలను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ప్ర‌త్యేక‌మైన నైపుణ్యాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు ఈ -కామ‌ర్స్ ద్వారా ఈ -గోల్కొండ పోర్ట‌ల్‌ను రూపొందించుకున్నాం. వీటి ద్వారా చేనేత అమ్మ‌కాల‌ను విక్ర‌యిస్తున్నాం. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా మ‌న సంప్ర‌దాయాన్ని, స‌మ‌కాలీన మార్పుల‌ను దృష్టిలో ఉంచుకుని, కొత్త‌కొత్త డిజైన్ల‌తో ఈత‌రం, భ‌విష్య‌త్ త‌రం పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకునే విధంగా డిజైన్ల‌ను రూపొందిస్తున్నాం. అలా చేయ‌డం వ‌ల్ల ప‌ది కాలాల పాటు మ‌నుగడ ఉంటుంద‌నే ఉద్దేశంతో ఫ్యాష‌న్ షోల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.

చేనేత కార్మికుల సంక్షేమ కోసం బ‌డ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు :

డ‌బుల్ ఇక్క‌త్, ఆర్మూర్ ప‌ట్టుచీర‌లు, జ‌రిచీర‌లు, సిద్దిపేట గొల్ల‌భామ చీర‌లు తెలంగాణ స‌మాజంలో అంద‌రి ముందు క‌ద‌లాడుతున్నాయి. ఆధునిక‌మైన టెక్నాల‌జీని జోడించి కొత్త డిజైన్ల‌ను రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో వ‌చ్చే నేత క‌ళాకారుల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం బ‌డ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం. నేత‌న్న‌కు చేయూత ద్వారా కార్మికులకు భ‌రోసా ఇస్తున్నాం. చేనేత మిత్ర కింద నూలు, ర‌సాయ‌నాలు, రంగుల‌ను 50 శాతం స‌బ్సిడీతో కార్మికుల‌కు అందిస్తున్నామ‌ని తెలిపారు. న‌వ‌త‌రాన్ని ఆక‌ట్టుకునే విధంగా చేనేత‌ల‌ను తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.