15 నెలల్లో నగరంలో అందుబాటులోకి రానున్న మరో బయోఫార్మా హబ్ : మంత్రి కేటీఆర్

Another Biopharma Hub to Start Operations Soon in Hyderabad, B-Hub an accelerator for biopharma, Hyderabad, KTR Reveals that Another Biopharma Hub, KTR Reveals that Another Biopharma Hub to Start, KTR unveil glimpses of Biopharma Hub, Mango News, Minister KTR, Minister KTR Reveals that Another Biopharma Hub to Start Operations Soon, Minister KTR Reveals that Another Biopharma Hub to Start Operations Soon in Hyderabad

హైదరాబాద్‌ నగరంలో మరో బయోఫార్మా హబ్ (బి-హబ్) ఏర్పాటు కానుందని రాష్ట్ర ఐటీ, పురపాలక, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. భారతదేశంలో మొట్టమొదటి గ్రోత్-ఫేజ్ సెంటర్ మరియు బయోఫార్మా స్కేల్-అప్ తయారీ కేంద్రంగా ఈ బయోఫార్మా హబ్ ఏర్పాటు అవుతుందని తెలిపారు. మరో 15 నెలల్లో బి-హబ్ అందుబాటులోకి రానుందని, బయోఫార్మా రంగంలో తెలంగాణ నాయకత్వ స్థానాన్ని ఏకీకృతం చేయడానికి ఇది మరింత దోహదపడుతుందని అన్నారు.

రెండు దశల్లో 1,00,000 స్క్వేర్‌ ఫీట్లతో ఈ బి-హబ్ నిర్మాణం జరుగుతుందని, భారత ప్రభుత్వం (బయోటెక్ ఇండియా), సైటివా మరియు సెరెస్ట్రా వెంచర్స్‌తో ఒక ప్రత్యేక భాగస్వామ్య నమూనాలో తెలంగాణ ప్రభుత్వం (టీఎస్ఐఐసీ లిమిటెడ్ అండ్ తెలంగాణ లైఫ్ సైన్సెస్) బి-హబ్ ను అభివృద్ధి చేస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ