భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతు తెలిపిన మంత్రి కేటీఆర్, కేంద్ర ప్రభుత్వ చర్యను బీఆర్ఎస్ పార్టీ ప్రతిఘటిస్తుందని పునరుద్ఘాటించారు. ప్లాంట్ను ప్రైవేటుపరం చేసే కుట్రలను కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు అడ్డుకొంటున్న నేపథ్యంలో.. కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని ఆరోపించారు. వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణల సాకు చూపుతూ ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందని విమర్శించారు. అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలియజేయాలని బీఆర్ఎస్ ఏపీ యూనిట్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ను కోరిన కేటీఆర్.. విశాఖ ఉక్కు.. తెలుగు ప్రజల హక్కు, ప్లాంట్ను కాపాడే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో మంత్రి కేటీఆర్.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగా సంస్థను నష్టాల్లోకి నెట్టారని, ఈ సంక్షోభాన్ని ప్రభుత్వం సాకుగా చూపి క్రోనీ క్యాపిటలిస్టులకు అప్పగిస్తున్నదని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఇనుప ఖనిజం గనులను కేటాయించడంలో కేంద్రం విఫలమైందని, స్టీల్ ప్లాంట్ దాని ఉత్పత్తి వ్యయంలో 60% వరకు ముడి పదార్థాలపై ఖర్చు చేయవలసి వచ్చిందని అన్నారు. ఇక మరోవైపు, ఇనుప ఖనిజం, బొగ్గు మరియు ఇతర గనులను వారికి కేటాయించినందున ప్రైవేట్ కంపెనీలలో ముడిసరుకు ధర 40% కంటే తక్కువగా ఉందని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడుతున్నందున సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉత్పత్తి పరంగా మార్కెట్లో ఉన్న ధరకే విక్రయించాల్సి రావడంతో ప్లాంట్ నష్టాలను చవిచూస్తోందని వివరించారు. ఇప్పటికైనా కేంద్రం ఈ చర్యలను ఆపేసి, స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి రూ.5,000 కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE