తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. శ్రీదేవి సమేతంగా తిరుమాఢ‌ వీధిలో విహరించిన మలయప్ప స్వామి

Three Days of Annual Salakatla Vasanthotsavam of Lord Venkateswara Begins in Grand Way at Tirumala Today,Three Days of Annual Salakatla Vasanthotsavam,Vasanthotsavam of Lord Venkateswara Begins,Grand Way at Tirumala Today,Mango News,Mango News Telugu,Annual Vasanthotsavam at Tirumala from April 3 to 5,TTD Vasanthotsavam Seva Details,Tirumala Today News,Salakatla Vasanthotsavam Latest News,Salakatla Vasanthotsavam Latest Updates,Tirumala Live News

తిరుమల ఆలయ క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి వసంత-సాలకట్ల వసంతోత్సవం వార్షిక ఉత్సవం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో నేటి నుండి 5వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. కాగా ఈ మూడు రోజుల వేడుకలను ప్రతి ఏడాది పవిత్రమైన చైత్ర శుద్ధ పౌర్ణమికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మూడు రోజుల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య వసంత మండపం వద్ద ఘనంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రెండో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య స్వర్ణ రథోత్సవం జరగనుంది. కాగా ఈ ఉత్సవాల సందర్భంగా ఈ మూడు రోజుల్లో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేయగా, ఏప్రిల్ 4న అష్టదళ పాద పద్మారాధన సేవ కూడా రద్దు చేయబడింది.

ఇక ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన ఈరోజు ఉదయం 7 గంటలకు శ్రీదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారిని ఆలయానికి అనుకుని ఉన్న నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామివారు వసంతోత్సవ మండపానికి చేరుకున్నారు. అక్కడ వసంతోత్సవ అభిషేక నివేదన పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. ఈ విశేష పూజలో పాలు, పెరుగు, తేనే, పసుపు, చందనం, కొబ్బరినీళ్లు వంటి వాటితో స్వామివారి మూర్తులకు అభిషేకం చేస్తారు. అలాగే సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 3 =