తెలంగాణ జానపద పాటలకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా అమూల్య స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ నుండి విడుదలైన ‘సీరే కట్టుకున్నానని’ సాంగ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ జానపద గాయని ప్రభ తనదైన శైలిలో పాడిన ఈ పాట పక్కా లోకల్ బీట్‌తో హుషారెత్తిస్తోంది.
ఒక యువతి తన ప్రియుడి అల్లరిని, అతనిపై ఉన్న ఇష్టాన్ని వర్ణిస్తూ సాగే ఈ పాటలో సాహిత్యం చాలా సహజంగా, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది. “మూడు ముళ్ళు వేస్తానని ముద్దులిమ్మంటాడు.. ఏడు జన్మలు విడువనని ఏందే అంటుంటాడు” అంటూ సాగే చరణాలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. Gajwel Venu సంగీతానికి ప్రభ గాత్రం తోడవ్వడంతో ఈ జానపద గీతం తక్కువ సమయంలోనే వైరల్ అయింది . జానపద పాటలను ఇష్టపడేవారు తప్పక వినాల్సిన పాట ఇది.







































