పట్టభద్రుల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి : మంత్రి పువ్వాడ అజయ్

Grad MLC polls, Graduate MLC polling, Graduates MLC Elections, Khammam, Khammam Graduates MLC Elections, Khammam Graduates MLC Elections 2020, Khammam MLC Elections, Khammam MLC Elections 2020, Minister Puvvada Ajay Kumar, Puvvada Ajay Kumar, puvvada ajay kumar transport minister

పట్టభద్రుల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం నాడు ఈ ఎన్నికల దృష్ట్యా ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొని మాట్లాడారు. త్వరలో జరుగబోయే పట్టభద్రుల ఎన్నికలకు ప్రతిగ్రామంలో ఉన్న పట్టభద్రులను ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని కోరారు.

త్వరలో జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సూచించిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. త్వరలో జరుగునున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ ఎన్నిక మనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాలని అందుకు పార్టీ శ్రేణులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థి ఎవరైనా విజయం కోసం సమష్టిగా కృషి చేయాలని కోరారు. బూత్‌ లెవల్‌లో ప్రతి పట్టభద్రుడికి ఓటు కల్పించాలని, ఇది వరకు ఉన్నప్పటికీ మళ్ళీ నమోదు చేయాలని సూచించారు. వారితో పాటు సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలను నియమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సర్పంచులు, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu