బిగ్ బాస్ యాజమాన్యంపై నెటిజన్స్‌ అసంతృప్తి..

Netizens Disappointed on Re-release of The Previously Released Promo of Bigg Boss Telugu 7,Netizens Disappointed on Re-release,The Previously Released Promo of Bigg Boss Telugu 7,Re-release of The Previously Released Promo,Mango News,Mango News Telugu,Bigg Boss, grand launch on September 3, new season of 'Bigg Boss', Annapurna Studio,host, hosted by Nagarjuna,Promo of Bigg Boss Telugu 7 News,Bigg Boss Telugu 7 Latest News,Bigg Boss Telugu 7 Latest Updates,Bigg Boss Telugu Live Updates

తెలుగులో అప్పుడే ‘బిగ్ బాస్’ ఫీవర్ మొదలైనట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ‘బిగ్ బాస్’కు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. 7వ సీజన్‌‌ను సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి షో యాజమాన్యం సన్నాహలు చేస్తోంది. ‘బిగ్ బాస్’ కొత్త సీజన్‌ కోసం అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్న భారీ సెట్‌ కూడా పూర్తి కావొచ్చింది. ఈ సీజన్‌లో హోస్ట్‌‌‌ను మారుస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ, 7వ సీజన్‌లో కూడా కింగ్ అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

గత మూడు ‘బిగ్ బాస్’ సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. హౌస్‌లోకి వచ్చిన ఆర్టిస్టులు పెద్దగా ఫేమస్ కాకపోవడం..’బిగ్‌ బాస్’ ఆడించే గేమ్స్ ఆసక్తికరంగా లేకపోవడం ఇలా అన్ని కలిసి.. ‘బిగ్‌ బాస్’ షో ప్లాప్‌ అయ్యేలా చేశాయి. దీంతో టీఆర్పీ రేటింగ్స్‌ సైతం భారీగా పడిపోవడంతో.. షో యాజమాన్యం.. 7వ సీజన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకూ విడుదలైన ప్రోమోలు షోపై అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి.

‘బిగ్‌ బాస్’ ఏడో సీజన్‌లో కంటెస్ట్‌ల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తలు వహించినట్టు సమాచారం. ఫేమస్ యాక్టర్స్‌తోపాటు, కపుల్స్‌ను కూడా ఈసారి ఎంపిక చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ‘బిగ్ బాస్’ యాజమాన్యం చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో విడుదల చేసిన ప్రోమోనే మళ్లీ విడుదల చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘బిగ్ బాస్‌’కు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఆశపడిన నెటిజన్లకు నిరాశే ఎదురైంది. ‘బిగ్ బాస్‌’ నమ్మించి మోసం చేశాడని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే ‘బిగ్ బాస్‌’పై అంచనాలు తగ్గిపోతాయ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ప్రోమోల ద్వారానే షోకు మంచి క్రేజ్ వచ్చే ప్లాన్ చేయడంలో షో యాజమన్యం సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తుంది. మరి త్వరలో ప్రారంభం కానున్న ‘బిగ్‌ బాస్’ ఏడో సీజన్ ఎలాంటి సంచనాలను సృష్టిస్తోందో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here