రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సమీక్ష

Chief Secretary, Chief Secretary held Review on New Excise Policy of the State, Mango News, Minister Srinivas Goud, Minister Srinivas Goud and Chief Secretary held Review on New Excise Policy, Minister Srinivas Goud and Chief Secretary held Review on New Excise Policy of the State, New Excise Policy, New Excise Policy Implementation, New Excise Policy Implementation In Telangana, Review on New Excise Policy, Srinivas Goud, Telangana Excise Policy, TS Excise Policy

రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖపై అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ తో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పనపై సీఎస్ సోమేశ్ కుమార్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చర్చించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 30వ తేదీతో బార్ ల లైసెన్సుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో 2021-22 సంవత్సరానికి గాను నూతన బార్స్ లైసెన్స్ లకు సంబంధించిన అంశాలపై మంత్రి ప్రధానంగా సమీక్షించారు.

వీటితోపాటు A4 వైన్ షాప్ ల లైసెన్సుల గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగిస్తున్న నేపథ్యంలో నవంబర్ 1వ తేది నుండి అమల్లోకి వచ్చే నూతన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన విధి విధానాలను రూపొందించుటకై మంత్రి ఈ సమీక్ష లో చర్చించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీరా ప్రాజెక్టు నిర్మాణ పనులను వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ