తెలంగాణలో నూత‌న‌ గ్రామ పంచాయ‌తీలకు త్వ‌ర‌లో కొత్త భ‌వ‌నాలు, నిధుల కేటాయింపుపై మంత్రులు చర్చ

Ministers Errabelli Satyavathi Rathod held Review on Construction of New Gram Panchayat Buildings, Minister Satyavathi Rathod held Review on Construction of New Gram Panchayat Buildings, Minister Errabelli held Review on Construction of New Gram Panchayat Buildings, Review on Construction of New Gram Panchayat Buildings, Construction of New Gram Panchayat Buildings, New Gram Panchayat Buildings, Ministers Errabelli And Satyavathi Rathod, New Gram Panchayat Buildings News, New Gram Panchayat Buildings Latest News And Updates, New Gram Panchayat Buildings Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో ప‌రిపాల‌నా సౌల‌భ్యం-సంస్క‌ర‌ణ‌ల‌లో భాగంగా ఏర్పాటైన నూత‌న‌ గ్రామ పంచాయ‌తీల‌న్నింటికీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన హామీ, కేటాయించిన నిధుల‌తో వారి ఆదేశాల మేర‌కు త్వ‌ర‌లోనే కొత్త భ‌వ‌నాల‌ను ద‌శ‌ల వారీగా నిర్మిస్తామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి సత్య‌వ‌తి రాథోడ్ లు తెలిపారు. అలాగే భ‌వ‌నాలు లేని పాత గ్రామ పంచాయ‌తీల్లోనూ కొత్త భ‌వ‌నాలు నిర్మిస్తామ‌న్నారు. కొత్త‌గా గ్రామ పంచాయ‌తీలుగా ఏర్ప‌డ్డ లంబాడా తండాలు, ఏజెన్సీ గూడాల్లోనూ త్వ‌ర‌లోనే కొత్త భ‌వ‌నాల‌ను నిర్మిస్తామ‌న్నారు. ఈ విష‌య‌మై నిధులు, విధి విధానాలు, ప్ర‌ణాళిక‌లు వంటి ప‌లు అంశాల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మంత్రి శ్రీ‌మ‌తి సత్య‌వ‌తి రాథోడ్ తో క‌లిసి మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ లోని త‌న నివాసంలో గురువారం చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజ‌న సంక్షేమ‌శాఖ కార్య‌ద‌ర్శి క్రిష్టినా జెడ్ చొంగ్తు, పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్ హ‌నుమంత‌రావు, పంచాయ‌తీరాజ్ ఇఎన్ సి సంజీవ‌రావు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్ లు మాట్లాడుతూ, రాష్ట్రంలో 12వేల 769 గ్రామ పంచాయ‌తీలు ఉన్నాయ‌ని, అందులో గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాలు లేని తండాలు 1 వెయ్యి 97 ఉండ‌గా, ఏజెన్సీ ప్రాంతాల్లో 688 ఉన్నాయ‌ని చెప్పారు. అలాగే 2వేల 960 మైదాన ప్రాంత గ్రామ‌ పంచాయ‌తీల్లో భ‌న‌వాలు లేవ‌న్నారు. మొత్తం 4వేల 745 గ్రామ పంచాయ‌తీల‌కు కొత్త భ‌వ‌నాల అవ‌స‌రం ఉంద‌న్నారు. అయితే వీటిలో ఇప్ప‌టికే సంబంధిత ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధుల నుండి అందిన ప్ర‌తిపాద‌న‌లు, ఇంకా ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి అందాల్సిన ప్ర‌తిపాద‌న‌ల‌ను బ‌ట్టి ద‌శ‌ల వారీగా తండాల‌కు, ఏజెన్సీ ఆవాసాల‌కు, ఇత‌ర గ్రామాల‌కు ప్రాధాన్య‌తా క్ర‌మంలో కొత్త గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాల‌ను మంజూరు చేసి, పంచాయ‌తీరాజ్‌, గిరిజ‌న సంక్షేమ‌శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో వేగంగా నిర్మిస్తామ‌న్నారు. ఇప్ప‌టికే కొన్ని గ్రామాల్లో కొత్త భ‌వ‌నాల ప‌నులు ప్ర‌గ‌తిలో ఉన్నాయ‌ని, ఇంకా మిగ‌తా అన్నిచోట్ల కొత్త గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాల‌ను నిర్మిస్తామ‌ని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY