ఏపీలో 10వేలకు పైగా గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు – వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు

AP Over 10000 Village Secretariats Recognised For YSR Clinics Says Health Principal Secretary Krishna Babu, AP Health Principal Secretary Krishna Babu, Over 10000 Village Secretariats Recognised For YSR Clinics, 10000 Village Secretariats, Village Secretariats, YSR Health Clinics, AP CM YS Jagan Mohan Reddy, AP Health Principal Secretary, Krishna Babu, YSR Health Clinics News, YSR Health Clinics Latest News And Updates, YSR Health Clinics Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వేలకు పైగా గ్రామ సచివాలయాలను వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లుగా గుర్తించామని, త్వరలోనే వీటి నుంచి ఆరోగ్య సేవలను ప్రారంభిస్తామని ఏపీ వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఇక ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారని ఆయన తెలిపారు. ఈ విధానం ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇళ్ల వద్దకు వెళ్ళి వైద్య సేవలు అందిస్తామని, దీనికోసం ప్రతి మండలానికి 4 డాక్టర్‌లను నియమిస్తున్నామని వివరించారు. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 8,500 హెల్త్ క్లినిక్‌ భవనాలను నూతనంగా నిర్మిస్తున్నామని, ఈ ఏడాది నవంబర్ నెలాఖరులోగా వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణం పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.

శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందిని ఈ క్లినిక్‌లలో నియమిస్తామని కృష్ణబాబు అన్నారు. ఈ క్లినిక్‌ల ద్వారా 14 రకాల వైద్య పరీక్షలు గ్రామ స్థాయిలోనే చేసేందుకు ఏర్పాట్లు చేశామని, అలాగే మొత్తం 67 రకాల ఔషధాలను అందుబాటులో ఉంచనున్నామని కృష్ణబాబు వివరించారు. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని చెప్పిన ఆయన మరో 176 పీహెచ్‌సీలను అదనంగా ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులను నియమిస్తామని, త్వరితగతిన సేవలు అందేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో 42,000 పోస్టులను భర్తీ చేశామని, సంక్రాంతి నాటికి మరో 4 వేల మందిని నియమించటానికి సన్నాహాలు ప్రారంభించామని కృష్ణబాబు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + six =