తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం?

inter results, Inter Results 2020, Inter Results In Telangana, Intermediate Results In Telangana, Intermediate Results to Release, Telangana Inter Results, Telangana Inter Results 2020, Telangana Intermediate Results, Telangana Intermediate Results 2020, TS Inter Results 2020

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను ఒకేసారి ప్రకటించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుందని, ఫలితాలను ఈ నెలలోనే వెల్లడించే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. వాల్యుయేషన్ పక్రియ పూర్తయ్యాక, ఫలితాల నమోదు, స్కానింగ్, మార్క్స్ లోడింగ్, మెమో తయారీ తదితర అంశాలకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియ అంతా జూన్ 15 నాటికి పూర్తీ చేసి, ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొదటి, రెండవ సంవత్సర ఫలితాల పూర్తివివరాలు ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో జూన్ 17, లేదా 18 న ఫలితాలు విడుదల కానున్నట్టు సమాచారం. తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =