మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 16 వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి శ్రద్ధాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు. పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కే.కేశవరావు, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ, పీవీ మన ఠీవీ అన్నారు. అఖండ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఒకే ఒక్క తెలుగు వాడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని పేర్కొన్నారు. పీవీ మేధావి, బహుభాషావేత్త, కవి, రచయిత, అనువాదకుడు. తన భూములను పేదలకు పంచి, నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ ధాత అని కీర్తించారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి పదవులు చేపట్టారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. దేశాన్ని కాపాడారు. దేశ రక్షణ కొరకు అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ నరసింహారావు అంటూ కొనియాడారు.
రాజకీయ నీతికి, రాజనీతికి పీవీ నిలువెత్తు నిదర్శనం:
“పీవీ సంస్కరణల స్ఫూర్తి తోనే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక పరిపాలన సంస్కరణలు తెస్తున్నారు. జూన్ 28, 2020 నుండి జూన్ 28, 2021 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నది. పీవీకి భారత రత్న ఇవ్వాలని, వారి చిత్ర పటాన్ని పార్లమెంటులో పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. పీవీ పుట్టిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే, మంత్రులము కలిసి లక్నేపల్లిని సందర్శించినం. వారు ఉమ్మడి వరంగల్ జిల్లా వారు కావడం మా అదృష్టం” అని మంత్రులు చెప్పారు. పీవీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. నిరాడంబర జీవితానికి, నిజాయితీకి, రాజకీయ నీతికి, రాజనీతికి నిలువెత్తు నిదర్శనం పీవీ అని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు కొనియాడారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ