హైదరాబాద్ పరిధిలో 192 చెరువులను తనిఖీ చేసిన 15 మంది ఇంజనీర్లు, అధికారుల బృందం

Flood Management, Flood Management Committee, Flood Management Committee Inspects 182 Lakes and Ponds, Flood Management Organisation, Hyderabad Flood Management Committee, Inspection Of Lakes and Ponds in GHMC Area, Lakes and Ponds in GHMC Area

అక్టోబర్ 12 నుండి కురిసిన భారీ వర్షాల వలన హైదరాబాద్ నగరంపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చెరువుల పటిష్టతను పరిశీలించి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాలకు అనుగుణంగా 15 మంది ఇంజనీర్లు, అధికారులతో నీటి పారుదల శాఖ ఒక నిపుణుల గ్రూప్ ను నియమించింది. ఈ నిపుణుల బృందం హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న 185 చెరువులు, కుంటలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 7 చెరువులను తనిఖీ చేసింది. ఆయా చెరువుల స్థితిపై నివేదిక రూపొందించింది. భారీ వర్షాల వలన 14 చెరువులకు గండ్లు పడ్డాయని, 6 చెరువులు క్రిటికల్ స్టేజ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 27 తూములు, 32 చెరువుల కట్టలు, 31 చెరువుల అలుగులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. గండ్లు పడిన, దెబ్బతిన్న చెరువుల రక్షణకు అత్యవసర మరమ్మతులకై రూ.9 కోట్ల 84 లక్షల 50 వేలు, శాశ్వత మరమ్మతులకు రూ. 31 కోట్ల 64 లక్షలు నిధులు అవసరమవుతాయని తెలిపారు. అలాగే భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న 9 చెరువులు సంరక్షించుటకు యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేశారు.

మరమత్తులు చేసిన 9 చెరువులివే:

1) పల్లె చెరువు, మైలార్ దేవ్ పల్లి, బండ్లగూడ (మండలం)
2) గుర్రం చెరువు, బార్కాస్, బండ్లగూడ(మండలం)
3) అప్పా చెరువు, గగన్ పహాడ్, రాజేంద్రనగర్ (మండల్)
4) సూరం చెరువు, బండ్లగూడ (గ్రా, మండలం)
5) ఎర్రకుంట లక్మ్షిగూడ, రాజేంద్రనగర్ (మండలం)
6) కుమ్మరికుంట, అమ్మగల్, హయత్ నగర్ (మండలం)
7) చిన్న పెద్ద చెరువు, గోపన్ పల్లి, శేరిలింగంపల్లి (మండలం)
8) కొత్తకుంట, హఫీజ్ పేట్, శేరిలింగంపల్లి (మండలం)
9) తిమ్మక్క చెరువు, పటాన్ చెరు, (గ్రా, మండలం)

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 19 =