రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖ, పురపాలక శాఖ అధికారులతో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, “డెంగ్యూ కేసులు హైదరాబాద్ నగర పరిధిలోను, జిల్లాలోను పెరుగుతున్నాయి. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయి. ఇది ఐదో సంవత్సరం కాబట్టి డెంగ్యూ కేసులు కొంచెం పెరుగుతున్న తీరు గమనిస్తున్నం. కాబట్టి వైద్య ఆరోగ్య పురపాలక, పంచాయతీ శాఖలు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. జీహెచ్ఎంసీ పరిధిలో జులై నెలలో 542 డెంగ్యూ కేసులు ఉంటే ఆగస్టులో 1827 కేసులున్నాయి. డెంగ్యూను కారకమైనది మంచి నీటి దోమ. ఇవి పగటి పూటనే కుడతాయి. తొట్టిలో, కొబ్బరిచిప్పలు, పాత టైర్లు వంటి వాటిలో పెరుగుతాయి.. జీహెచ్ఎంసీలో 1600 మంది ఎటమాలజీ స్టాప్ ఉన్నారు. వీరంతా బాగా పని చేస్తున్నారు. వీరితో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది కలిసి ప్రతీ ఇంటికి వెళ్లి చైతన్యపర్చాలి. ప్రజా ప్రతినిధులు ప్రజలను భాగస్వామ్యం చేయించాలి. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా పది వేల బ్లడ్ యూనిట్లు సేకరించడం జరిగింది. ప్లెట్స్ లేట్స్ సపరేటర్ మిషన్లు అందుబాటులో ఉంచాము. ఎంత బ్లడ్ అవసరమైన ఉచితంగా ఇచ్చేందుకు వైద్యఆరోగ్య శాఖ తరపున ఉచితం అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతీ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యులు, మందులు, ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంది” అని అన్నారు.
సెప్టెంబర్ 17న హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టి ఉచితంగా ప్రజలకు బ్లడ్ ఇచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ తరుపున ఏర్పాట్లు చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. “జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జ్వర బాధితులు బస్తీ దవాఖానాకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలి. డెంగ్యూ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని వైద్య సిబ్బంది డోర్ టు డోర్ జ్వర సర్వే నిర్వహించాలి. టీ డయాగ్నసిస్ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స అందిస్తాం. ప్రజలు ఆందోళన చెందవద్దు. డెంగ్యూ కేసుల నిర్థారణకు ర్యాట్ కిట్స్ బస్తీ దవాఖానాల్లో అందుబాటులో ఉంచాం. జ్వరం వస్తే వెంటనే బస్తీ దవాఖానాల్లో వెళ్లి చికిత్స చేయించుకోవాలి. టి డయాగ్నోసిస్ ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి వైద్యం అదింస్తాం. 27వేల టెస్టులు గతన్న నెలన్నరగా టీ డయాగ్నసిస్ ద్వారా చేయడం వల్ల కేసులు పెరిగినట్లు కనిపిస్తున్నాయి. బస్తీ దవాఖానాల వల్ల ఫీవర్ ఆసుపత్రికి కేసులు తగ్గాయి. గాంధీ ఆసుపత్రికి కేసులు తగ్గాయి. ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ లో బ్లడ్ సపరేటర్స్ ఉన్నాయి. బ్లడ్ విషయంలో ఇబ్బంది లేదు. ఈ జ్వర సర్వేతో పాటు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ప్రతీ ఒక్కరికి జీహెచ్ఎంసీ పరిధిలో వేసేందుకు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ సిబ్బంది, వైద్య సిబ్బంది కలిసి పని చేయాలి” అని మంత్రి హరీశ్ రావు సూచించారు.
అలాగే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్న వార్డుల్లో నివారణకై ప్రత్యేక ప్రణాళిక తయారుచేయాలని కమిషనర్, జోనల్ మరియు డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో కాలనీల్లో జ్వర సర్వే నిర్వహించాలన్నారు. హైదరాబాద్ సహా జిల్లాల్లో డెంగ్యూ కేసులున్న పట్టణ ప్రాంతాల్లోనూ జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు. “ఆదివారం పది గంటలకు పది నిమిషాలు” ఇంటిని శుభ్రపరిచే కార్యక్రమం కోసం చిన్న పిల్లలను, మహిళలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొని సామాజిక బాధ్యతగా పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఇక మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఎఎస్ అధికారులు కూడా తమ గృహాలలో ఈ కార్యక్రమం నిర్వహించాలని, కలెక్టర్లు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందని, డిజిటల్ మాధ్యమంలో బాగా ప్రచారం నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY