తెలంగాణ సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది – మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Minister Sabitha Indra Reddy Announces Admissions Increased in Govt Schools Because of Good Facilities in Telangana, Minister Sabitha Indra Reddy, Announces Admissions Increased in Govt Schools, Admissions Increased in Govt Schools, Minister Sabitha Indra Reddy Govt Schools, Sabitha Indra Reddy on Telangana Govt Schools, Telangana Minister Sabitha Indra Reddy, Govt Schools Good Facilities in Telangana, Govt Schools Admissions Increased, Sabitha Indra Reddy Latest News And Updates, Telangana

టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా సర్కారీ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ మేరకు హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుల్లో మంత్రి సబిత ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి జయంతి సందర్భంగా .. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పలువురు టీచర్లను ఇతర మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీతో కలిసి ఆమె ఘనంగా సన్మానించారు.

అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించారని, తద్వారా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని కలిగించారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధికంగా గురుకులాలు ఏర్పాటుచేసి ఉచిత విద్య అందిస్తున్నామని, రాష్ట్ర విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలపై యావత్ దేశమే తెలంగాణ వైపు చూస్తోందని పేర్కొన్నారు. ఇక కరోనా ఆపత్కాల సమయంలో ఉపాధ్యాయులు చేసిన సేవలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదని, విద్యార్థుల భవిష్యత్ పాడవకూడదని ప్రస్తుత టెక్నాలజీని వినియోగించుకుని ఆన్‌లైన్‌లో కూడా బోధనలు కొనసాగించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eleven =