చివరి వరకూ హోరాహోరీ పోటీ తప్పదా?

Who will get the seat of Paleru Assembly,Who will get the seat,seat of Paleru Assembly,Paleru Assembly,Palair Assembly Election 2023,Mango News,Mango News Telugu,Telangana Election 2023 Results,Palair Election 2023,Paleru Assembly,Symbol, voters,BRS,BJP,Congress,CPI, CPM Telangana Assembly Election 2023,TS Election 2023,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Jayveer Reddy Latest News,Jayveer Reddy Latest Updates
Paleru Assembly,Symbol, voters,BRS,BJP,Congress,CPI, CPM Telangana Assembly Election 2023,

ఎప్పుడు ఎలక్షన్స్  జరిగినా కొన్ని నియోజకవర్గాలలో రాజకీయాలలో ప్రత్యేకంగా నిలుస్తూనే ఉంటాయి. అలాంటి నియోజకవర్గాలలో ముందుండే పేరు పాలేరు.  ఉమ్మడి జిల్లాకు స్వాగత ద్వారంగా పిలుచుకునే పాలేరు నియోజకవర్గంలో.. ఈసారి  రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరా హోరీగా పోటీలో ఉండగా.. ఏ పార్టీతోనూ పొత్తులు కుదరకపోవడంతో సీపీఎం కూడా పోటీకి దిగింది. అక్కడ సీపీఎం అభ్యర్థి పోటీలో ఉండటంతో.. ఏ పార్టీకి  నష్టం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌లోకి వస్తుంది. పాలేరును గ్రామీణ నియోజకవర్గంగానే చెబుతారు. పాలేరు నియోజకవర్గంలో మొత్తంగా 1,92,820 మంది ఓటర్లు ఉన్నారు. ఈ  ఓటర్లలో  95,001 మంది పురుష ఓటర్లు, 97,803 మంది మహిళలు ఉన్నారు.

2018 లో జరిగిన  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో, పాలేరులో 90.99 శాతం ఓటింగ్ నమోదవగా.. 2014లో జరిగిన ఎన్నికలలో 90.32 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి చెందిన రామిరెడ్డి వెంకటరెడ్డి 21,863 ఓట్లు అంటే 12.32 శాతం మెజార్టీతో గెలిచారు. అలాగే మొత్తం పాలేరులో పోలైన ఓట్లలో రామిరెడ్డి వెంకట రెడ్డికి 39.28 శాతం ఓట్లు నమోదయ్యాయి.  2014 లోక్‌సభ ఎన్నికలలో, ఖమ్మం పార్లమెంటరీ  నియోజకవర్గంలోని పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో వైసీపీ ముందంజలో ఉంది.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో పోటీ చేసిన  కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన కె.ఉపేందర్ రెడ్డికి 89,407 ఓట్లు పోలయ్యాయి.అయితే ఆ సమయంలో.. బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన  తుమ్మల నాగేశ్వర రావుకు 81,738 ఓట్లు రావడంతో.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. అప్పుడు పాలేరు స్థానంలో మంచి పట్టుందన్న పేరు బడిన సీపీఐ ఎం పార్టీ తరపున  బత్తుల హైమావతి పోటీ చేయగా.. ఆమెకు  కేవలం 6,769 ఓట్లు మాత్రమే  వచ్చాయి. నోటాకు 1271, బీజేపీకి  1170 ఓట్లు చొప్పున పోలయ్యాయి. మొత్తం పాలేరులో 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వీరిలో ఆరుమంది స్వతంత్ర అభ్యర్థులే.

తాజా ఎన్నికలలో పాలేరు సీటులో సీపీఎం, సీపీఐ ఓట్ల మధ్య చీలికలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఓ వైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీలో ఉండగా.. సీపీఐ నేతలు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. దీంతో వామపక్షాల ఓటు బ్యాంకులో గందరగోళం ఏర్పడి ఓటర్లు రెండు చీలిపోయి..కాంగ్రెస్‌కు కొందరు, సీపీఎంకు కొందరు ఓట్లు వేసే పరిస్థితి ఏర్పడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 4 =