కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ తో రేవంత్ రెడ్డి భేటీ

MP Revanth Reddy Meets Krishna River Board Chairman

ఆగస్టు 20, గురువారం నాడు జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంతో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు 2014 లోనే అనుమతులు వచ్చాయని, భూసేకరణ, ఇతర అవసరాల కోసం రూ.133 కోట్లు నిధులు కూడా మంజూరు చేశారని చైర్మన్ కు వివరించి, ఈ ప్రాజెక్టు తక్షణమే చేపట్టేలా చూడాలని రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకున్న నీటి వివాదాలకు సంబంధించి ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu